Site icon NTV Telugu

NTR: మ్యూచువల్ ఫ్యాన్స్ హంగమా మాములుగా లేదుగా…

Ntr

Ntr

డిసెంబర్ 12… ఈ డేట్ ని ఇంటర్నేషనల్ స్టైల్ డేగా మార్చేయాలేమో ఎందుకంటే ఈరోజు స్టైల్ సినోనిమ్ లాంటి రజినీకాంత్ పుట్టిన రోజు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కోట్లలో అభిమానులు ఉన్నారు. డెమి గాడ్ స్టేటస్ ని రజినీకాంత్ కి ఇచ్చి అభిమానులు ఆయన సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ పాన్ ఇండియా హీరోలయ్యారు కానీ రజినీకాంత్ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో రజినీకాంత్ సినిమా స్ట్రెయిట్ మూవీగానే రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ మూవీగా రిలీజ్ అవ్వకుండా హైప్ తో ఆడియన్స్ ముందుకి వస్తుంది. ప్రతి రజినీకాంత్ సినిమా పాన్ ఇండియా సినిమాగానే థియేటర్స్ లోకి వస్తుంది. రీజనల్ మార్క్స్ ని ఎప్పుడో దాటేసిన రజినీకాంత్ బర్త్ కావడంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

రజినీకాంత్ బర్త్ డే కి ఎన్టీఆర్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు ప్రతి రజినీకాంత్ బర్త్ డేకి ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే రజినీకాంత్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రాండ్ గా బర్త్ విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిన చాలా మంది రజినీకాంత్ కి కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు. ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి రజినీకాంత్ కి స్పెషల్ విషెస్ వచ్చాయి. ఎన్టీఆర్ కూడా రజినీకాంత్ ని ట్యాగ్ చేస్తూ “Wishing the one & only Thalaivar Rajinikanth sir, a very Happy Birthday. May your charisma continue to inspire for generations” అంటూ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ నుంచి ట్వీట్ రావడంతో మ్యూచువల్ ఫ్యాన్స్ సందడి మరింత పెరిగింది.

Exit mobile version