JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన వార్-2 బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ముందు నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బజ్ అసలే లేదు. ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా చూపించారంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను నమ్ముకుని రూ.80 కోట్ల దాకా పెట్టేసిన నాగవంశీ.. ఇందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ను నమ్మి తెలుగులో ఈ స్థాయిలో పెట్టేశాడు నాగవంశీ.
Read Also : Udaya Bhanu : పవన్ కల్యాణ్ పక్కన సాంగ్ చేయనని చెప్పేశా.. యాంకర్ ఉదయభాను కామెంట్స్
దీంతో ఎన్టీఆర్ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ వారితో మాట్లాడి ఇందులో నాగవంశీ చెల్లించిన దాంట్లో నాలుగో వంతు వెనక్కి ఇప్పించేందుకు ఒప్పించాడంట. అవసరం అయితే తన రెమ్యునరేషన్ లో కొంత భాగం తిరిగి ఇచ్చేందుకు కూడీ రెడీ అయినట్టు తెలుస్తోంది. తనను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతను తన వంతుగా ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. కూలీ సినిమా ముందు వార్-2ను తక్కువ కాకుండా చూసేందుకు నాగవంశీ ముందుకు వచ్చారు. కాబట్టి అతన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందంటూ ఎన్టీఆర్ ఇలా చేసినట్టు తెలుస్తోంది.
Read Also : Nikhil Abburi : 100% లవ్ లో బుడ్డోడు.. ఇప్పుడు హీరోలా మారిపోయాడే..
