NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కు అమెరికా వెళ్లి రాగానే మొదటిసారి విశ్వక్ సేన్ కోసం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాలిపోయాడు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదట ఆస్కార్ అవార్డును అభిమానుల ప్రేమకు అంకితం చేశాడు. ఇదంతా అభిమానుల ప్రేమ వలనే జరిగిందని చెప్పుకొచ్చాడు. “ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ పటం లో నిలబడింది ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, ఎంత కారణమో.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణం. అలాగే యావత్ తెలుగు జాతి కారణం.. అభిమానుల అభిమానం కారణం. ఆస్కార్ వేదిక పై చంద్రబోస్ గారిని కీరవాణి గారిని చూసినప్పుడు ఇద్దరు భారతీయులు ఆ అవార్డ్ తీసుకున్నారు అనిపించింది. మీరు ఎంత సంతోషించారో మేము అంతే సంతోషించాం. మీ ఆనందాన్ని మేము పంచుకున్నాం.
ఇక విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే.. సాధారణంగా నేను ఎలాంటి సినిమాలు చూడను. కానీ, ఏదైనా చూడాలి అనిపించినప్పుడు, కొద్దిగా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు విశ్వక్ సినిమా ఈ నగరానికి ఏమైంది చూశాను. ఎంతో అద్భుతంగా చేశాడు. బాధను కళ్లలో దాచుకొని పైకి మనల్ని నవ్వించాడు. ఇక ఆ తర్వాత ఫలక్ నామా దాస్, పాగల్ సినిమాలు చూసాను.. మనోడు ఒకేలా చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. కానీ, అంతలోనే అశోకవనంలో అర్జున కళ్యాణం చేశాడు. నేను కూడా ఒక పాత్ర నుంచి ఇంకొక దాంట్లోకి మారాలంటే కొద్దిగా టైమ్ తీసుకుంటాను.. కానీ, విశ్వక్ ఈజీగా చేసేశాడు. అంత చేంజ్ అయిపోతాడా.. నేను ఒక చట్రంలో నుంచి బయటపడడానికి చాలా టైమ్ పట్టింది. నిజంగా షాక్ అయ్యాను.. విశ్వక్ ఇంత పరిణితి చెందాడా అని.. హిట్ అనే సినిమా చూసి షాక్ అయ్యాను. నటుడిగా నేను చెప్తున్నాను.. అంత బ్యాలెన్సుడ్ గా సినిమాలు చేయడం చాలా కష్టం. అది విశ్వక్ కు కుదిరింది. అది తను చేసిన పుణ్యమది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతూ ఉండే నటుడు తను.. ఈ సినిమాకి డైరెక్టర్ గా కూడా అతను చేసాడు.
ఇక ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తాను డైరెక్ట్ చేయకుండా ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు నీలాంటి యంగ్ డైరెక్టర్లు ఇంకా రావాలి. ఇక నువ్వు డైరెక్ట్ చేయడం ఆపేయ్. తెలుగు పరిశ్రమ అద్భుతమైన స్థానంలో ఉంది. ఈ సినిమా ఉగాదికి రిలీజ్ అవుతుంది విశ్వక్ సేన్ కి పండుగ అవ్వాలి. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడానికి ఇంకొకరు కూడా కారణం.. వారే మీడియా ప్రతినిధులు. వారికి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఆర్ఆర్ఆర్ ను తమ సినిమాగా భావించారు. మీ ప్రేమనే మాకు ఆశీర్వాదాలు” అని చెప్పుకొచ్చాడు. అంతలోనే క్రౌడ్ నుంచి అన్న నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అరవడంతో ఎన్టీఆర్ కొద్దిగా ఫైర్ అయ్యాడు. ” నేను చేయడం లేదు.. నా నెక్స్ట్ సినిమా చేయడం లేదు..ఆపేసా.. ఎన్నిసార్లు అడుగుతారు.. మొన్ననే కదా చెప్పాను” అంటూ నవ్వేశాడు. త్వరలోనే సినిమా ఉండనుందని, ఇలా అడిగిది నిజంగా సినిమాలు మానేస్తాను అని చెప్పుకొస్తూనే.. అయినా నేను సినిమాలు మానేస్తే మీరుఊరుకోరులే అంటూ నావ్వ్వులు పూయించాడు.