Site icon NTV Telugu

Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్

Mogli

Mogli

‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. యువ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆయన కొత్త లుక్‌, న్యూ యాక్షన్ మోడల్‌ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ‘మోగ్లీ’ టీజర్‌ను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, ఈ టీజర్‌ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అంతే కాదు ఈ టీజర్‌ను మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఈ టీజర్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Also Read : the Raja Saab : రీషూట్ల రూమర్స్‌కి చెక్..‘రాజాసాబ్’పై మేకర్స్ గ్యారెంటీ

అవును, రోషన్ కనకాల ప్రాజెక్ట్‌కి ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ రేంజ్‌ తో టీజర్‌ పై ఒక్కసారిగా భారీ హైప్‌ క్రియేట్ అయింది. దర్శకుడు సందీప్ రాజ్ గతంలో ‘కలర్ ఫోటో’తో డిఫరెంట్ స్టైల్‌లో తన ముద్ర వేసుకున్నాడు. ఆ సినిమాకు వచ్చిన క్రిటికల్ అప్రిసియేషన్ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ‘మోగ్లీ’తో ఆయన మరోసారి సెన్సిబుల్ ఎమోషన్‌, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలయికను చూపబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా బండి సరోజ్ కుమార్ కనిపించబోతున్నారు. సంగీతాన్ని కాల భైరవ అందిస్తుండటం కూడా ఈ సినిమాకు మరో బలమైన పాజిటివ్ పాయింట్‌గా మారింది.

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం, టెక్నికల్‌గా కూడా చాలా రిచ్‌గా తెరకెక్కుతోందని సమాచారం. మేకర్స్ మాటల్లో “మోగ్లీ ఓ యువకుడి భావోద్వేగ ప్రయాణం, అందులో యాక్షన్‌, ఎమోషన్‌, సస్పెన్స్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్‌ రిలీజ్ చేయబోతున్నాడనే వార్తతో ‘మోగ్లీ’ టీమ్ ఆనందంలో ఉంది. నవంబర్ 12న టీజర్‌ రాగానే సినిమా మీద ఉన్న అంచనాలు మరో స్థాయికి వెళ్లేలా కనిపిస్తున్నాయి.

Exit mobile version