Site icon NTV Telugu

నాతో మాట్లాడలేదు.. భార్య ప్రణతిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. చాలా తక్కువ టైమ్ లోనే చరణ్, రాజమౌళి లాంటి స్టార్స్ ను షోకు తీసుకురావడంతో షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా, ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం.

ఓ టాపిక్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు మాట్లాడడానికి అంతగా భయపడరు, కానీ నా భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదని ఎన్టీఆర్ తన అనుభవాన్ని తెలిపారు. పెళ్లి చూపులు సమయంలో లక్ష్మీ ప్రణతి నాతో మాట్లాడలేదు.. అసలు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా లేక బలవంతంగా చేస్తున్నారా అని అడిగాను..? అప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి మనసులో మాట చెప్పలేదు. నిశ్చితార్థం తరువాత పెళ్ళికి 8 నెలల గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.. ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం ఎంత కష్టమో తనకు అప్పుడు అర్థమైందని, అది తెలిసిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడని..’ ఎన్టీఆర్ అనడంతో ఒక్కసారిగా షోలో అందరు నవ్వులు పూయించారు.

Exit mobile version