NTR: ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తాత్కాలికంగా డ్రాగన్ షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయట. హీరో అవసరం లేని సన్నివేశాలు, ఇతర నటీనటులతో కూడిన ఎపిసోడ్‌లను ప్లాన్ ప్రకారం మేకర్స్ చిత్రీకరిస్తూ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తోందట. దీంతో సినిమా నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఎన్టీఆర్ చికిత్స పూర్తయ్యాక త్వరలోనే సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రీఎంట్రీ తర్వాత కీలక సన్నివేశాల షూటింగ్‌ను ప్రారంభించేలా మేకర్స్ ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పాజిటీవ్ వార్తలు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. తమ అభిమాన హీరో త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరుకెక్కుతున్న ఈచిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్ కొనసాగుతుండటంతో నిర్ణయించిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

