యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించాడు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ దుబాయ్ వెళ్ళాడు. బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకునే ముందు దుబాయ్ మొత్తం జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తింది. ఎన్టీఆర్ ని చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ సైమా ఈవెంట్ దగ్గరకి వెళ్లారు. అభిమానుల మధ్యలో రెడ్ కార్పెట్ పై ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ని చూడగానే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాత్రి 9 గంటల నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తూ నిద్ర కూడా పోకుండా మేలుకున్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా కనిపించడంతో జై ఎన్టీఆర్ నినాదాలతో రచ్చ చేసారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ నడుస్తుండగా ‘సీఎం ఎన్టీఆర్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు ఫ్యాన్స్.
సడన్ గా జై ఎన్టీఆర్ అనే స్లోగన్ పోయి సీఎం ఎన్టీఆర్ స్లోగన్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించింది. సైమా ఈవెంట్ దగ్గరికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సీఎం ఎన్టీఆర్ అని అరవడంతో ఆ ఏరియా మొతం ఆ స్లోగనే వినిపించింది. దీంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చినట్లు ఉంది, రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఒక్కసారిగా సీఎం ఎన్టీఆర్ అని అరుస్తున్న వారివైపు చూసాడు. ఎవరినీ ఏమీ అనలేదు, వద్దని వారించనూ లేదు కానీ ఎన్టీఆర్ సైలెంట్ గా రెడ్ కార్పెట్ నుంచి ఈవెంట్ లోపలికి వెళ్లిపోయాడు. సీఎం ఎన్టీఆర్ అనే స్లోగన్ వినిపించడం ఇదే మొదటిసారి కాదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి… ఎన్టీఆర్ స్పందించాలని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది నందమూరి అభిమానులు కోరుకుంటున్న సమయంలో ఈ నినాదం వినిపించడం విశేషం.