Jr NTR :అరుదైన ఘనత సాధించిన దేవర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.దేవర మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దేవర మూవీ మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఇదే కాకుండా బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ సరసన ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న మరో క్రేజీ మూవీ NTR31. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.కేజీఎఫ్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు నెలకొంది.
ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులు తలెత్తుకునేలా ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించాడు.2023లో ఆసియాలో టాప్ 50 నటుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ‘ఈస్టర్న్ ఐ 2023’ పేరుతో ప్రకటించింది. ఆసియా టాప్ 50 యాక్టర్స్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ 25వ స్థానంను సాధించుకున్నాడు. దీంతో ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అంటే తెలుగు నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైగా హీరోగా ఎన్టీఆర్ నిలవడం విశేషంగా మారింది. ఈ వార్త తో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇక ఏషియన్ టాప్ 50లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే అలియా భట్ మరియు ప్రియాంక చోప్రా రెండు, మూడు స్థానాలు సంపాదించుకున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌కు 6, ఇళయదళపతి విజయ్‌కు 8 స్థానాలు లభించాయి.
Also Read
- Tags
- #got
- ntr
- rare record
తాజావార్తలు
-
Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!