NTV Telugu Site icon

Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!

Daavudi Song Release

Daavudi Song Release

Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్, చుట్టమల్లే సాంగ్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్‌ మధ్యలో..’ఆ..’ అంటూ అనిరుధ్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అది ఇది అని కాదు.. ఏ ఈవెంట్ తీసుకున్న సరే.. ‘ఆ.. ‘అంటూ ఆడిటోరియం దద్దరిల్లిపోతోంది. అయితే.. మెలోడి సాంగ్‌కే ఇలా ఉంటే.. మరి మాస్ సాంగ్ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే.. కొరటాల శివ దేవరను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు. అందులోను.. ఓ ట్రైబల్ తెగ నాయకుడు, కాపరి అని అంటున్నారు. అది పోను.. కారంచేడు ఊచకోత సంఘటన కూడా ఈ సినిమాలో కీ పాయింట్‌గా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Mahesh Vs Pawan: ‘గబ్బర్ సింగ్‌’ను కొట్టేలా ఏడాది ముందు నుంచే ప్లానింగ్?

అలాంటి.. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్ బాక్సులు బద్దలవుతాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాలో ఆయుధ పూజ సాంగ్‌కు అంతా పోతారని మేకర్స్ చెబుతున్నారు. కానీ అంతకంటే ముందే.. మాస్ ఫెస్ట్ లాంటి మాస్ వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన దావుడా మాస్ బీట్.. ఫియర్, చుట్టమల్లే సాంగ్‌కు మించి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్టే విజువల్ పరంగా చాలా కలర్ ఫుల్‌గా ఉంది ఈ సాంగ్. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ అయితే.. విజిల్స్‌కే మోత పెట్టించేలా ఉంది. జాన్వీ మాస్ రేంజ్ గ్లామర్ తో పాటు ఆమె వేసిన స్టెప్పులు కూడా పాటకే హైలెట్‌ అనే చెప్పాలి. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. థియేటర్లో ఈ సాంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను సీట్లో కూర్చోకుండా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మొత్తంగా అనిరుధ్ మాత్రం.. టైగర్ ఫ్యాన్స్‌కు మాస్ ఫెస్ట్ ఇస్తున్నాడనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 27న దేవర ఏం చేస్తాడో చూడాలి.

Show comments