Site icon NTV Telugu

Jr NTR: గోవా నుంచి హైదరాబాదులో దిగిన దేవర

Jr Ntr News

Jr Ntr News

Jr NTR back to Hyderabad from Goa: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు? అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా అనౌన్స్ చేశాడు. ముందుగా ఒక భాగంగానే రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా రెండు భాగాలు అయింది. అందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ దాన్ని అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుతున్నారు.

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి గాయం.. ఏమైందంటే?

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ఆయన షూట్ పార్ట్ ముగియడంతో ఈరోజు ఆయన గోవా నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత సినిమా ఏం చేసినా డిజాస్టర్ అనే టాక్ ఉంది. దాన్ని తప్పించుకునే ప్రయత్నం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version