Site icon NTV Telugu

ఎన్టీఆర్30: ఫ్యాన్స్ కు శుభవార్త అందించబోతున్న కొరటాల

‘జనతా గ్యారేజ్’ సినిమాతో దర్శకుడు కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పాత కలెక్షన్స్ ను రిపేర్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న.. ఇప్పటివరకు మిగితా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే వారం సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనుందనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలోని హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన ప్రకటనతో పాటే షూటింగ్ ప్రారంభించే తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొని ఉండగా.. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా విడుదల తేదీపై సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version