WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.
HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది ఒక రకంగా సంతృప్తిని కలిగించేలా ఉంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా వస్తోంది. దాని నుంచి వార్-2కు భారీ పోటీ ఉంది. అయినా సరే ఎన్టీఆర్ కు సౌత్ లో ఉన్న ఇమేజ్ తో ఈ మూవీ బలమైన పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
WAR 2 Trailer : Pawan Kalyan : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ హీరోగా కంటిన్యూ..?
