NTV Telugu Site icon

Josh Ravi: అవకాశాలు రాకపోతే ఆ పనైనా చేస్తాను కానీ, జబర్దస్త్ కు మాత్రం వెళ్లను

Josh

Josh

Josh Ravi: అక్కినేని నాగచైతన్య నటించిన మొదటి సినిమా జోష్ సినిమాతో కమెడియన్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ గ్యాంగ్ లలో ఉంటూ గోడమీద కూర్చొని వచ్చేపోయేవారిపై కవితలు రాసే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత రవి కాస్తా జోష్ రవిగా మారిపోయాడు. జోష్ ఆశించిన హిట్ అందుకోలేకపోయిన .. రవికి మాత్రం అవకాశాలను బాగానే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలు చేస్తూ కమెడియన్ గా స్థిరపడిపోయారు. మధ్యలో రెండేళ్లు జబర్దస్త్ లో కూడా పనిచేశాడు. ఇక ఈ మధ్య దయ అనే వెబ్ సిరీస్ తో జోష్ రవికి మరింత పేరు వచ్చింది. జేడీ చక్రవర్తి తమ్ముడిగా దయ సిరీస్ లో ముఖ్యపాత్రను చేశాడు. నిజం చెప్పాలంటే సిరీస్ లో రవి పాత్ర హైలైట్ గా నిలిచింది. ఇది రవి ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని మొత్తం చెప్పుకొచ్చాడు. 14 ఏళ్ళ కెరీర్ లో వందకు పైగా సినిమాలు చేస్తే.. ఒక 20 సినిమాలకు పేరు వచ్చిందని చెప్పాడు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో గే క్యారెక్టర్ కు బాగా పేరు వచ్చిందని, రవితేజ ఫోన్ చేసి మెచ్చుకుంటే కన్నీళ్లు ఆగలేదని తెలిపాడు. ఇక జబర్దస్త్ లో తాను చేసిన రోజులను గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు ఆ షోలో రూ. 2 వేలకు పనిచేశాను అని ఇప్పుడు రూ. 2 లక్షలు ఇచ్చినా వెళ్లను అని చెప్పుకొచ్చాడు.

Varun Tej: లావణ్యతో సీక్రెట్ లవ్ స్టోరీ.. ఎట్టకేలకు బయటపెట్టిన మెగా ప్రిన్స్

” జబర్దస్త్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ, ఇప్పుడు రూ. 2 లక్షలు ఇస్తాను అని చెప్పినా వెళ్లను. ఎందుకంటే .. నాకు సినిమాలే ముఖ్యం. సినిమాల్లో ఇప్పుడు నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఇప్పటివరకు జబర్దస్త్ కు నాలుగుసార్లు గెస్ట్ గా వెళ్లాను. ఇంకోసారి గెస్ట్ గా రమ్మంటే వెళ్తాను కానీ, అందులో కంటెస్టెంట్ గా మాత్రం వెళ్లను. నేను జబర్దస్త్ కు వెళ్లకముందే 20 సినిమాలు చేశాను. అక్కడికి వెళ్ళాక నాకు కేవలం రూ. 2 వేలు మాత్రమే ఇచ్చేవారు. నాకు ఇప్పుడు సినిమాలు మాత్రమే ముఖ్యం.. అవకాశాలు రాకపోతే ఇంట్లో ఖాళీగానైనా ఉంటాను కానీ, జబర్దస్త్ కు మాత్రం వెళ్లను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జోష్ రవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments