Site icon NTV Telugu

Kalki 2898AD: సలార్ ను రేపు ఒక్కరోజు పక్కన పెట్టండి మావా.. కల్కి వస్తున్నాడు

Kalki

Kalki

Kalki 2898AD: సలార్.. సలార్ .. సలార్ అంటున్న ప్రభాస్ అభిమానులు.. ఇక కల్కి అనడం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సలార్ తో రికార్డులు బద్దలుకొట్టిన ప్రభాస్ .. ఆ రికార్డులను తానే బ్రేక్ చేయడానికి కల్కితో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమిత బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్‌, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఎటువంటి లీక్స్ లేకుండా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఇన్నిరోజులు మేకర్స్ మాట్లాడిందే లేదు. కానీ మొట్టమొదటిసారి కల్కి విశేషాలను పంచుకోవడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముంబైకు రాబోతున్నాడు.

ఐఐటీ బాంబే TECH FEST 23 కు నాగ్ అశ్విన్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ ఫస్ట్ రేపు అనగా డిసెంబర్ 29 న జరగబోతుంది. ఇక ఇప్పటికే బాంబే ఐఐటీలో కల్కి వైబ్ మొదలైయిపోయింది. రైడర్స్ లుక్ లో కొంతమంది హల్చల్ చేశారు. ఎక్కడ చూసినా కల్కి పోస్టర్లతో ఐఐటీ బాంబే కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్ కు వస్తాడా..? కల్కి గురించి విషయాలు చెప్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సలార్.. సలార్ అంటూ అరిచినా ఫ్యాన్స్ రేపటినుంచి కల్కి కల్కి అని అరవబోతున్నారు. మరి నాగీ ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నాడో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Exit mobile version