Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumalatha: హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) మీడియా సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫెడరేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న హాల్లోకి డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తన మద్దతుదారులతో కలిసి ఒక్కసారిగా ప్రవేశించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ‘ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్’ అని ప్రచారం చేస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలినైన తనను పిలవకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సుమలత ఫైర్ అయ్యారు. ఫైల్స్, పత్రాలు చేతబూని నేరుగా వేదికపై కూర్చున్న ఫెడరేషన్ కార్యవర్గ నేతల వద్దకు దూసుకెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగారు. జానీ మాస్టర్‌పై గతంలో నాన్-కోఆపరేషన్‌ను ఎత్తివేసిన తర్వాత, మళ్లీ ఆయనను ఎందుకు పని చేయకుండా బ్యాన్ చేశారంటూ సూటిగా వారిని ప్రశ్నించారు.
సుమలత నేతలను నిలదీస్తుండగా, ఫెడరేషన్ సభ్యులు ఆమెను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో మీడియా సమావేశం పూర్తిగా రసాభాసగా మారింది. కెమెరాలు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే పరస్పర వాదనలు, దూషణలతో ఛాంబర్ ప్రాంగణం దద్దరిల్లింది. తన భర్త జానీ మాస్టర్ ఎక్కడా మీడియా ముందుకు రాకపోయినా, వ్యక్తిగత కక్షతో ఆయన పొట్టకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ యూనియన్‌లో జరుగుతున్న అవకతవకలను తాను ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అడ్డం పెట్టుకుని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. అనూహ్యంగా జరిగిన ఈ హైడ్రామాతో ఫిల్మ్ ఛాంబర్లో ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?