John Abraham: హిందీ రీమేక్ దిశగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ కాగా… ఈ సినిమా హిందీలో కూడా రానుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్ హక్కులు జాన్ అబ్రహం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయన అనురాగ్ కశ్యప్‌కి అప్పగించినట్టు సమాచారం. మరో పాత్రను ఎవరు చేయనున్నారనేది త్వరలోనే తెలియనుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు.
మలయాళంలో 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ – బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాను తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మలయాళ మూలం దెబ్బతినకుండా త్రివిక్రమ్ ఆ కథలో చాలా మార్పులు చేశాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ – రానా నటించగా, ఇక్కడ కూడా విశేషమైన ఆదరణ పొందింది. ఒక బలమైన మల్టీ స్టారర్ సినిమాగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.
Also Read
ఇక భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కగా.. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను జాన్ అబ్రహం కొనుగోలు చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ హిందీలో విడుదలైతే, జాన్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని, భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేయకుండా జాన్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో జాన్ అబ్రహంతో పాటు అర్జున్ కపూర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!