JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioHotstar Trending: ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు కొన్ని రోజులు మాత్రమే ట్రెండింగ్‌లో కనిపించి తర్వాత మాయమైపోతాయి.అయితే కొన్నింటికి మాత్రం ప్రేక్షకుల నుంచి లభించే స్పందన భిన్నంగా ఉంటుంది. విడుదలై రోజులు గడిచినా అదే జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి విజయాన్నే అందుకుంటోంది ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ (Thukra Ke Mera Pyaar Season 2). ప్రేమ, మోసం, ప్రతీకార థీమ్స్ తో రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, జియో హాట్‌స్టార్‌లో వరుసగా ఎనిమిది రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి మంచి వ్యూయర్షిప్ను నమోదు చేస్తోంది. ప్రస్తుతం టాప్ 3 ట్రెండింగ్ జాబితాలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మొదటి స్థానంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ‘లాఫ్టర్ చెఫ్’ కొనసాగుతుండగా, రెండో స్థానాన్ని ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దక్కించుకోవడం విశేషంగా మారింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దాదాపు రూ.12,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. అంటే, ఓటీటీ వ్యూయర్షిప్ పరంగా ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ ఆ భారీ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి ముందంజలో నిలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ కథ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుల్దీప్ అనే యువకుడు, అదే ఊరిలో పలుకుబడి ఉన్న చౌహాన్ కుటుంబానికి చెందిన షాన్విక అనే యువతిని ప్రేమిస్తాడు. మొదట అతని ప్రేమను అంగీకరించినట్టే కనిపించే షాన్విక, అనూహ్యంగా తన కుటుంబం వైపు నిలబడి కుల్దీప్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తుంది. ఈ సంఘటనతో కుల్దీప్ జీవితం పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుంచి ప్రేమ, మోసం, న్యాయం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథ ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది.
Also Read
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… 'మిస్టర్ మిడిల్ క్లాస్' నుంచి 'జన నాయగన్', 'చెన్నై లవ్ స్టోరీ' వరకు!
- Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
మొదటి సీజన్‌కు లభించిన ఆదరణతోనే రెండో సీజన్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సస్పెన్స్, ఎమోషన్స్, ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువత నుంచి ఈ సిరీస్‌కు మంచి స్పందన ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో వరుసగా ఎనిమిది రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’, రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తుందా? లేక కొత్త రిలీజ్ లు దాని స్థానాన్ని దక్కించుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఓటీటీ ప్రేక్షకుల మదిలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ టాప్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
- Tags
- cinema
- JioHotstar
తాజావార్తలు
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!