ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఇది షాకింగ్ న్యూస్. మరో మార్షల్ ఆర్ట్స్ హీరో మనల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాలకు మీరు అందించిన సహకారం, యువ తరాలకు పలికిన మద్దతు, అందజేసిన జ్ఞానం పరిశ్రమలో ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మేము నిన్ను మర్చిపోలేము’ అన్నారు.
జిమ్మి వాంగ్ వయసు 79 సంవత్సరాలు షాంఘైలో జన్మించి తైవాన్ లో స్థిరపడిన వాంగ్ తైపీ లో కన్నుమూశారు.
రెండు దశాబ్దాల పాటు 70కి పైగా సినిమాల్లో నటించిన జిమ్మీ వాంగ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో తనదైన ముద్రవేశారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, యాక్షన్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ గా పని చేసిన జిమ్మీ వాంగ్ కుమార్తె లిండా వాంగ్ కూడా నటి, గాయకురాలు కావటం విశేషం. నటుడు కాక ముందు నేషనల్ రివల్యూషనరీ ఆర్మీలో పని చేసిన వాంగ్ తన సీనియర్ నటి జీన్నెట్టీ లిన్ చుయ్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.
