SriKamal: సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గుంటూరు రామకృష్ణ ఎస్.ఆర్.కె. ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి విజయ భాస్కరే దర్శకులు. అంజు అశ్రాని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీకమల్ సరసన శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జిలేబీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇందులోని చివరి రెండు పాటలను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Jilebi: డైరెక్టర్ విజయభాస్కర్ తనయుడి చిత్రం షూటింగ్ పూర్తి!

Jileebi