JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్‌కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్‌కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. “రామ్ గోపాల్ వర్మ గారికి తెలియకుండానే కోన వెంకట్ చేత మొదట పాట రాయించాను. వర్మ గారు మాత్రం పాటను వేరే రచయితతో రాయించాలని అనుకున్నారు. కానీ కోన వెంకట్‌పై ఉన్న నమ్మకం, అభిమానం కారణంగా ఆయన చేత పాట రాయించాను” అని చెప్పారు.
అప్పట్లో తాను ‘సత్య’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నానని, ఎడిటింగ్‌తో పాటు సౌండ్ డిజైన్, ఇతర పనులను కూడా చూసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో కోన వెంకట్ రాసిన పాటలను రికార్డ్ చేయించానని వెల్లడించారు. ఆ పాట నచ్చిన తర్వాత అదే నమ్మకంతో కోన వెంకట్‌తో సినిమా డైలాగులు కూడా రాయించినట్లు జేడీ తెలిపారు. “వర్మ గారు సత్యానంద్ గారి చేత రాయించాలని అనుకున్నప్పటికీ, కోన వెంకట్ మీద ఉన్న నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చాను” అని అన్నారు. తర్వాత కాలంలో 2004 లో దుబాయ్ శీను సినిమా టైంలో కోన వెంకట్ తనకు ఫోన్ చేసి సినిమాలో నటిస్తే బాగుంటుందని చెప్పారని, అయితే అది తన కోసం కాదని, సినిమా కోసం చేసిన నిర్ణయమని జేడీ స్పష్టం చేశారు. “కోన వెంకట్‌తో నాకు అప్పటికే పరిచయం ఉంది. మాకు మంచి స్నేహం ఉండటంతోనే ఆయన నాకు దుబాయ్ శీను సినిమాలో అవకాశం ఇచ్చారు” అని జేడీ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం జేడీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?