Site icon NTV Telugu

Gopichand: కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. కానీ!

Gopichand New Project

Gopichand New Project

టాలీవుడ్ మాచో మ్యాన్ గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని, కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇంతకుముందు శంఖం, గౌతమ్ నంద సినిమాలకు కలిపి పని చేసిన జే. భగవాన్, జే పుల్లారావుల నిర్మాణంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ నిర్మాతలు కొత్తగా జేబీ ఎంటర్టైన్‌మెంట్స్ (జడ్డు బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్స్) అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇదివరకే ఈ బ్యానర్‌పై ఓ సినిమా నిర్మించిన వీళ్లు.. ఇప్పుడు గోపీచంద్ రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ‘ప్రొడక్షన్ నం.2’గా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను ఓ మాస్ దర్శకుడు తెరకెక్కించనున్నాడని కూడా తెలిపారు కానీ, అతనెవరన్నది రివీల్ చేయలేదు. త్వరలోనే ఆ దర్శకుడి పేరుని ప్రకటిస్తామని సస్పెన్స్‌లో పెట్టేశారు. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ఆ దర్శకుడు సంపత్ నంది అయ్యుండొచ్చని చెప్తున్నారు. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ముగిసిన తర్వాత, గోపీచంద్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించనున్నాడు. అంటే, ఇది సెట్స్ మీదకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందన్నమాట! గోపీచంద్ ఇమేజ్‌కి తగినట్టుగానే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు వార్తలొస్తున్నాయి.

కాగా.. ప్రెజెంట్ గోపీచంద్ తన ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉండటం, మారుతికి మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం, ప్రొడక్షన్ హౌస్ కూడా పేరుగాంచిందే కావడంతో.. ‘పక్కా కమర్షియల్’పై మంచి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version