ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ‘జయమ్మ.. చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయక పల్లె పడుచుల సుమ కనిపించింది.
ఒకపక్క వడ్డీ వ్యాపారం చేసే ఆమె వడ్డీ కట్టకపోతే వస్తువులను తీసుకెళ్లి మరి డబ్బులు వసూలు చేయడం చూపించారు.. అంతలోనే పసిబిడ్డను ఎత్తుకొని అన్నం తినిపించి తన కొంగుతో మూతి తుడవడం చూపించి.. సుమ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. జయమ్మ మాట కఠినమైన.. మనసు మాత్రం వెన్న అని, పైకి అలా కనిపించినా అస్సలు నిజం అదికాదని సాంగ్ ద్వారా తెలియజేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కీరవాణి ఈ సినిమాకు సంగీతంఅందించారు. ఇక సింగర్ శ్రీ కృష్ణ ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్ గా ఆలపించి హైప్ తెచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాతో సుమ హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.
