Site icon NTV Telugu

Jayam Ravi : ‘దేవుడిని మోసం చేయలేవు’.. జయం రవి టూర్‌పై ఆర్తి కౌంటర్

Jayam Ravi Arthi

Jayam Ravi Arthi

తమిళ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఈలోగా జయం రవి తన స్నేహితురాలు, గాయని కెనీషా తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ టూర్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జయం రవి మాజీ భార్య ఆర్తి షేర్ చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “నువ్వు ఇతరులను మోసం చేయవచ్చు.. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు.. కానీ దేవుని మాత్రం మోసం చేయలేవు”అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఈ మాటలను జయం రవి ని ఉద్దేశించి రాసి ఉంటారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇదే కాదు, ఇటీవల ఆమె తన పిల్లల కోసం మరో నోట్ షేర్ చేశారు. అందులో, “ఉత్తమ తల్లిదండ్రులంటే ఎల్లప్పుడూ పిల్లల కోసం ఆలోచించేవారే. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఏ పరిస్థితులు వచ్చినా వారిని కాపాడండి” అని పేర్కొన్నారు. అంటే దీని బట్టి..

వీరిద్దరూ విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతే కాదు తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇవ్వాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజంట్ అయితే తాజా పోస్ట్‌లు.. టూర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version