Site icon NTV Telugu

Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం రవి ‘సైరన్’

Siren Release

Siren Release

Jayam Ravi’s ‘Siren’ to be released in Telugu on February 23 : ‘తని ఒరువన్’ ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ ” ‘సైరన్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించామని అన్నారు. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని లుక్ మరియు పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు.

Chiru: వెంకీ మామ బాటలో మెగాస్టార్?

ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు. ఇక హీరో జయం రవి మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయని, వాటికి జివి ప్రకాష్ తన సంగీతంతో ప్రాణం పోశాడని అన్నార. ఇండియాలో ఉన్న మేటి సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాష్ అగ్ర స్థానాల్లో ఉంటాడు, అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుంది అనుకున్నాము, మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టిందన్నారు. ఆంథోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం, కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే నాకు చిత్ర విజయం కనిపిస్తుందన్నారు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా ‘సైరన్’ తమిళ – తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది” అన్నారు.

Exit mobile version