Site icon NTV Telugu

Jayam Ravi: ఆ వివాదంలో స్టార్ హీరో.. ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు..?

Jayam Ravi

Jayam Ravi

Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ఆయన నటించిన సైరన్ మూవీ టైటిల్ చిక్కులో పడింది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిన జయం రవి ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను ప్రకటించాడు. ఆంటోని భాగ్యరాజు దర్శకత్వంలో జయం రవి నటిస్తూఅన్నా చిత్రం సైరన్. నిన్ననే ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చిపడింది. ఇటీవల కోలీవుడ్ సినిమాలు తమిళ్ లో ఏదైతే టైటిల్ ఉంటుందో తెలుగులో కూడా ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తున్నారు.

ఉదాహరణకు వలిమై, కడవర్, వీరుమాన్ ఇలా అర్ధం కానీ పేర్లతోనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సైరన్ మూవీను కూడా తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ టైటిల్ ను తాము ముందే రిజిస్టర్ చేయించినట్లు పలువురు తెలుగు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకొంటుందని, ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా వస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు వాపోయారు. దీంతో జయం రవి చిత్రానికి తెలుగులో మరేదైనా పేరు పెట్టుకోవాలని, లేకపోతే తెలుగులో సినిమానురిలీజ్ చేయకుండా చూడాలని కోరుతున్నారట సదురు నిర్మాతలు. మరి ఈ విషయమై ఈ హీరో ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version