Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క సీరియల్స్ లో కనిపిస్తుంది. ఇక జయలలిత చేసిన పాత్రల్లో.. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో స్పీకర్ పాత్ర ఒకటి. ఆ పాత్రకు కొరటాల శివ.. జయలలితను ఎన్నుకున్నప్పుడు చాలామంది అతనిని వార్న్ చేశారట.. వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే ఆమెకు.. స్పీకర్ లాంటి పాత్ర ఎలా ఇస్తారు అని ఫైర్ అయ్యారట. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సమయంలో కొరటాల శివ ఏం చేశాడు అనేది జయలలిత బయటపెట్టింది.
” భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు మేడమ్ స్పీకర్.. మేడమ్ స్పీకర్ అని పలకడం వలనే దానికి అంత ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ పాత్రకు అంత ఎలివేట్ అయ్యింది అంటే .. అది 50 శాతం మహేష్ బాబు వలన .. మరో 50 శాతం నా స్ట్రెక్చర్.. బాడీ లాంగ్వేజ్ వలన.. శివగారు చేయించిన విధానం అని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం మొదట నిర్మాత దానయ్య గారు కాల్ చేసి.. ఇలా మహేష్ బాబు సినిమా ఉందమ్మా.. అనగానే ఆశ్చర్యపోయాను.. పెద్ద సినిమా చాలా కలం తరువాత వచ్చిందే అని అనుకున్నాను. పాత్ర ఉంది అన్నారు కానీ, ఎలాంటి పాత్ర అని నేను అడగలేదు.. నేరేషన్ కూడా ఇవ్వలేదు. సెట్ లోకి వెళ్లి కాస్ట్యూమ్ వేసుకొని నాకు నేను చూసుకుంటే.. చాలా నచ్చింది. ఇక శివగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే జయలలితకు ఎలా మీరు స్పీకర్ వేషం ఇచ్చారు అని ఎవరో అడిగారట.. అందుకు శివగారు చెప్పిన ఆన్సర్ నాకు ఎంతో బాగా అనిపించింది. మీరు ఆమెలో వ్యాంప్ ను చూసారేమో కానీ, నాకు ఆమె చీరకట్టులో ఒక అమ్మతనం కనిపించింది అన్నాడు. ఆయన మాటలకూ నేను ఎంతో రుణపడిపోయాను. ఆ సినిమా ఈవెంట్ స్టేజిపైనే చెప్పాను .. మళ్లీ జన్మ అంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున పుట్టాలని కోరుకుంటాను.. ఆ సినిమా తరువాత పెద్ద సినిమాలు ఏవి రాలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మళ్ళీ జన్మ అంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున పుట్టాలి అనుకున్నా..!! – Actress Jayalalitha#Jayalalitha #BharatAneNenu #MaheshBabu #KoratalaSiva #Tollywood #NTVENT #NTVTelugu pic.twitter.com/oWFdFoEpYm
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) September 15, 2023