Srinivasa Mangapuram OTT: ‘శ్రీనివాస మంగాపురం’ ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే!

Srinivasa Mangapuram1

Srinivasa Mangapuram1

Srinivasa Mangapuram OTT: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ ఆఫీషియల్‌గా వచ్చింది.

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ‘శ్రీనివాస మంగాపురం’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. జయకృష్ణ తొలి చిత్రం కావడం, రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో పాటు ఈ చిత్రంలో ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తుండగా, వైజయంతి మూవీస్ సమర్పిస్తుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.