NTV Telugu Site icon

Jawan: రేపు రిలీజ్ పెట్టుకొని బాయ్ కాట్ ఏంటిరా.. ?

Sharukh

Sharukh

Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జవాన్. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే క్యామియో లో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే జవాన్ కోసం షారుఖ్.. ఎప్పుడు చేయని ప్రమోషన్స్ చేశాడు. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈలోపే ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. జవాన్ బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది. అందుకు కారణం.. నటుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. అతనికి, జవాన్ కు సంబంధం ఏంటి అంటే.. ఉదయనిధి స్టాలిన్ కు రెడ్ జైయింట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ప్రొడక్షన్ లో మంచి హిట్ సినిమాలను అందించాడు.

MogaliRekulu RK Naidu: బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?

ఇక దీంతో పాటు ఇతర భాష సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటారు. తమిళ్ లో.. జవాన్ సినిమా డిస్ట్రిబ్యూట్ హక్కులను రెడ్ జైయింట్స్ అందుకుందని సమాచారం. దీంతో హిందూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడిన వ్యక్తి రిలీజ్ చేస్తున్న సినిమాను మేము చూడం.. బాయ్ కాట్ జవాన్ అని చెప్తూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయినా రేపు రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు బాయ్ కాట్ ఏంటిరా.. ? అంటూ నెటిజన్స్ వారిపై ఫైర్ అవుతున్నారు. ఇంకోపక్క ఈ బాలీవుడ్ సినిమాలకు బాయ్ కాట్ కొత్తేమి కాదు.. ? దీనివలన ఒరిగేది కూడా ఏమి లేదు.. ? అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో జవాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments