Site icon NTV Telugu

Jaragandi: జరగండి – జరగండి.. గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు!

Jaragandi Song

Jaragandi Song

Jaragandi song from Ram Charan’s Game Changer releasing on 27 March: రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ప్రకటించిన వాటి నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్ తో పాటు అనఫిషియల్ గా బయటకు వస్తున్న లీకులు కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే గతంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ లీక్ అయింది.

Gaami: ‘గామి’ అంటే అదే.. దాని కోసం ఎంతవరకైనా వెళ్ళాలి: డైరెక్టర్ విద్యాధర్ ఇంటర్వ్యూ

జరగండి జరగండి అంటూ సాగుతున్న ఒక సాంగ్ కి సంబంధించి పూర్తి రా మ్యూజిక్ ఆడియో లీక్ అయింది. అప్పట్లో ఈ వ్యవహారం మీద దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి సైబర్ క్రైమ్ ద్వారా ఎవరు చేశారో నిగ్గు తేల్చాలని కోరింది. ఆ సంగతి అలా ఉంచితే అసలు ఆ సాంగ్ సినిమాలోనే ఉండదు అనుకుంటే సినిమాలో పాట భాగమవుతుందని ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు మార్చి 27వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు ఒక అప్డేట్ రిలీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఈ సాంగ్ రిలీజ్ కాబోతూ ఉండడంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version