Site icon NTV Telugu

Japan: ఢిల్లీ కోసం ధరణి గాడు దిగుతున్నాడు..

Japan

Japan

Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మానియేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా దీపావళీ కానుకగా ప్రేక్షకులు ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. నవంబర్ 3న జేఆర్సీ కన్వెన్షన్ లో జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Biggboss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను హౌస్ అంతా ఒక్కటై చంపేశారుగా

ఇక ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మొదటినుంచి కూడా కార్తీ తన సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక ఖైదీ సినిమాలోని ఢిల్లీ పాత్రతో తెలుగులో కూడా ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. కార్తీ సినిమా తెలుగులో వస్తుంది అనడంతోనే ప్రేక్షకులు ఓ రేంజ్ లో అంచనాలను పెట్టుకోవడం మొదలుపెట్టారు. జపాన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వడమే.. తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాపై ఆసక్తిని చూపించారు. ఇక ఈ హైప్ కు తోడు ట్రైలర్ లాంచ్ లో సూర్య, కార్తీ కనిపించి మరింత హైప్ ను పెంచేశారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాని రావడం సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తుంది. మరి ఈ సినిమాతో కార్తీ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version