జాలీ గాళ్ జాన్వీ మరోసారి తన ‘అక్సా గ్యాంగ్’తో జనం ముందుకొచ్చేసింది. ‘ఖయామత్’ అంటూ ప్రత్యేకంగా ప్రజెంట్ చేసింది లెటెస్ట్ వీడియోని. తన క్రూతో కలసి యమ సరదాగా డ్యాన్స్ చేస్తూ జాన్వీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ హంగామాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అల్కా యాజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అప్పట్లో పాడిన క్లాసిక్ సాంగ్ ‘ఖయామత్’ బాణీలకు బాలీవుడ్ భామ తనదైన రీతిలో ఊగిపోయింది!
జాన్వీ కపూర్ బస చేసిన ఖరీదైన హోటల్ గదిలో తాజా వీడియో షూట్ చేశారు. అలాగే, బాత్ టబ్ లో బాలీవుడ్ బేబీ హొయలు పోవటం నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. లిప్ సింకింగ్ చేస్తూ తన టీమ్ తో కలసి తెగ అల్లరి చేసింది ‘దఢక్’ బ్యూటీ. ‘పేష్ కర్ రహే హై హమారా ఫైనల్ వీడియో. ఐ ప్రామిస్ యూ ఇట్స్ ఖయామత్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ‘అక్సా గ్యాంగ్’గా పేరుబడ్డ జాన్వీ టీమ్ నుంచీ విడుదలయ్యే సరదా వీడియోల్లో ఇదే చివరిదట. చాలా మంది ఇన్ స్టాలో కామెంట్ సెక్షన్ ని తన మాటలు, ఎమోటికాన్స్, జిఫ్స్ తో నింపేశారు. కొందరైతే ఈ డ్యాన్స్ పర్ఫెక్ట్ ‘మీమ్ మెటీరియల్’ అంటూ కామెంట్ చేశారు…
