NTV Telugu Site icon

Actress Sridevi: వారికి శ్రీదేవి ఇంట్లో గడిపే అవకాశం?

Sridevi

Sridevi

Janhvi Kapoor to rent out her childhood home in Chennai: ఏంటి బాసూ మీరు చెప్పేది నిజమా? అని అడిగితే నిజం అనే చెప్పాలి. శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు సైతం గడపగలరు. బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకం. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఇప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేలా అవకాశం కల్పిస్తున్నారని చెబుతన్నారు. నిజానికి Air BnB అనే ఒక హోటల్ బుకింగ్ సంస్థ ఈ ఇంటిని 11 ప్రసిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చింది. ఇక ఇంటి మెయింటెనెన్స్ సమస్య, లీకేజీ కారణంగా శ్రీదేవి, బోనీలు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణానంతరం బోనీ ఇంటికి మరమ్మతులు చేయించారు.

Pushpa2 : నార్త్ లో పుష్ప గాడి క్రేజ్ మాములుగా లేదు..ఇది ఆల్ టైం రికార్డ్ మామా..

శ్రీదేవి ఇంట్లో గడపాలని అందరూ అనుకుంటారు కానీ ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంది. అదేమంటే Air BnB వినియోగదారులు మాత్రమే ఒక రాత్రి అందులో ఉండగలరు. విశేషమేమిటంటే ఇక్కడికి వచ్చేవారికి జాన్వీ కపూర్‌తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందట. శ్రీదేవి వేసిన మొదటి పెయింటింగ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో జాన్వీ మరియు ఖుషీ కపూర్ వేసిన పెయింటింగ్‌లను కూడా గడిపే వారు చూసే అవకాశం ఉంది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఇదే అని అంటున్నారు. శ్రీదేవి నటిగా తన కెరీర్‌లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో పెళ్ళైన వెంటనే ఎంతో ముచ్చట పడి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన ఆ ఇంటిని రెంట్ కి ఇస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది.