టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ థింగ్‌గా మారబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. హిందీలో పెద్దగా స్టార్ డమ్ అందుకోలేకపోయిన జాన్వీ… తెలుగులో మాత్రం తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేసేలా ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతోంది జాన్వీ. ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ. ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్న రామ్ చరణ్… నెక్స్ట్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్ నుంచి ఆర్సీ 16 సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read Also: Kalki: ఈ ఇద్దరు కలిస్తే పాన్ ఇండియాకి పూనకాలే…
ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అయితే… ఈ సినిమా హీరోయిన్ విషయంలోనే క్లారిటీ రావడం లేదు కానీ లేటెస్ట్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… ఆర్సీ 16లో జాన్వీ ఫైనల్ అయినట్టే. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్సీ 16లో చరణ్ సరసన జాన్వీ కన్ఫామ్ అయిపోయింది. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా… బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్, చరణ్‌తో ఛాన్స్ అందుకోవడం జాన్వీకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.