NTV Telugu Site icon

Janhvi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…

Janhvi Kapoor

Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోలతో హల్చల్ చేసే జాన్వీ కపూర్, తరచుగా తిరుమల వెళ్తూ ఉంటుంది. అమ్మ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటని, అందుకే ఆమె లేకపోయినా తిరుమల వస్తూనే ఉంటానని జాన్వీ కపూర్ గతంలో చెప్పింది. చాలా ఫ్రీక్వెంట్ గా తిరుమల వచ్చే జాన్వీ కపూర్, తాజాగా తన ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుంది. గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరూ కలిసి తిరుమలలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. పింక్ లేహంగాలో ట్రెడిషనల్ డ్రెస్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించగా, శిఖర్ పహారియా టిపికల్ హిందూ బాయ్ ఎటైర్ లో కనిపించాడు. ప్రస్తుతం వీరి వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

ఇటివలే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ క్లబ్ ఓపెనింగ్ సమయంలో కూడా జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కలిసి కనిపించారు. ముంబైలో రెండు రోజుల క్రితమే కనిపించి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ జంట, ఇప్పుడు తిరుమలలో కలిపించి మరోసారి తమ రిలేషన్షిప్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. జాన్వీ కపూర్, శిఖర్ పహారియాలు తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వలేదు కానీ ఎక్కడికి వెళ్లినా కలిసి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ల కుటుంబాలు కూడా తరచుగా కలిసి కనిపిస్తుంటాయి కాబట్టి జాన్వీ కపూర్, శిఖర్ లు ప్రేమలో ఉన్నారు అనే వార్తలకి బలం చేకూరుతుంది. మరి ఈ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనా? లేక పెళ్లి వరకూ వెళ్లే ప్రేమ జంటనా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments