Janhvi Kapoor: అందంగా ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదు.. ముఖ్యంగా హీరోయిన్ల తాము కూడా రెడీ అవ్వాలని, వారి ముఖంలా తమ మోము కూడా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. హీరోయిన్ల బ్యూటీ సీక్రెట్స్ ను తెలుసుకొని వాటినే ఫాలో అవుతూ ఉంటారు. ఇక తాజాగా అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. అందాల అతిలోక సుందరి శ్రేదేవి ముద్దలా తనయగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తల్లి అందం తో పాటు అభినయాన్ని పుణికి పుచ్చుకొంది. నిధ్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో మెప్పించే ఈ బ్యూటీ తన అందాన్ని కాపాడుకోవడానికి తన తల్లి చెప్పిన టిప్ నే ఫాలో అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ మాట్లాడుతూ “మా అమ్మ శ్రీదేవి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేసాకా మిగిలిపోయిన పండ్ల ముక్కలను ముఖానికి మసాజ్ లా చేస్తూ ప్యాక్ పెట్టుకొనేది. అప్పటికప్పుడు ఏ పండ్లు ఉన్నా వాటిని ముఖానికి రాసుకొనేది. ఒక 10 నిముషాలు అలాగే ఉంచుకున్నాకా ఫేస్ వాష్ చేసుకునేది. ఇక అప్పుడు చూడాలి అమ్మ ముఖం.. మెరిసిపోతూ కనిపించేది. అదే ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను. నా అందానికి కారణం మా ఆమె చెప్పిన ఈ టిప్ మాత్రమే” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇంకేదనుకు ఆలస్యం జాన్వీ లా అందంగా మెరిసిపోవాలంటే మీరు కూడా ఈ టిప్ ను ట్రై చేసి చూడండి. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ గుడ్ లక్ జెర్రీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమాతో జూనియర్ అతిలోక సుందరి హిట్ ను అందుకొంటుందేమో చూడాలి.