Janhvi Kapoor:జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన అని కొందరు, చరణ్ సరసన అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ, జాన్వీ మనసులో ఉన్న హీరో మాత్రం వేరు అంట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన మనసులో ఉన్న హీరో పేరు చెప్పుకొచ్చింది. తనకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టమట. ఆయన నటించిన నేను రౌడీనే సినిమాను వందసార్లు చూసినట్లు చెప్పుకొచ్చింది.
” విజయ్ సేతుపతి అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన సినిమా నేను రౌడీనే వందసార్లు చూసాను. ఆయనతో నటించాలని ఉందని నేనే స్వయంగా ఫోన్ చేసి ఆయనను అడిగాను. మీతో నటించాలని ఉంది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..ఆడిషన్ కు వస్తాను అని చెప్పాను. ఆ మాటలకు అయ్యా.. అంటూ సరదాగా నవ్వారు తప్ప సమాధానం ఇవ్వలేదు. నాతో చేయడం ఆయనకు ఇబ్బందికరంగా ఉందేమో” అని చెప్పుకొచ్చింది. జాన్వీ అడిగితే విజయ్ ఎలా కాదన్నాడబ్బా అంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు విజయ్ సినిమాలో జాన్వీ ఛాన్స్ పట్టేస్తుందేమో చూడాలి.