Site icon NTV Telugu

Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

Janhvi-Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.

Read Also : Bheemla Nayak Event : త్రివిక్రమ్ సైలెన్స్… ఆయన కోసమేనా?

జాన్వీ తల్లితో తన చిన్ననాటి ఫోటోను పంచుకుంది. ఆ అందమైన ఫొటోకు ఇచ్చిన క్యాప్షన్‌లో జాన్వీ తన జీవితంలో తల్లి ఉనికిని ఎంతగా కోల్పోతుందో చెప్పుకొచ్చింది. “నేను ఇప్పటికే నా జీవితంలో మీరు లేకుండా ఎక్కువ సంవత్సరాలు జీవించాను. కానీ మీరు లేని జీవితానికి మరొక సంవత్సరం యాడ్ అవ్వడాన్ని నేను ద్వేషిస్తున్నాను. మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాను అమ్మా… ఎందుకంటే అది ఒక్కటే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతకుముందు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా తన తల్లి నాల్గవ వర్ధంతి సందర్భంగా శ్రీదేవిని తలచుకుంటూ ఆమెతో ఉన్న పాత ఫోటోను పంచుకున్నారు.

Exit mobile version