NTV Telugu Site icon

NTR30: టాలీవుడ్ ఫ్యాన్స్ ను టెంప్ట్ చేసి ముందే బుట్టలో వేసుకుంటున్నావా .. జాన్వీ

Janhvi

Janhvi

NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిసిన రూపం జాన్వీ కపూర్ ది. ఇక ఎన్టీఆర్ 30 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ సరసన నటించాలని కోరుకుంటున్నాను అని, త్వరగా ఆ అవకాశం రావాలని రోజు దేవుడు ను ప్రార్దించేదాన్ని అని చెప్పి టాలీవుడ్ ప్రేక్షకుల మనసు సగం గెలిచేసింది. ఎప్పుడెప్పుడు ఈ జంటను స్క్రీన్ మీద చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంకు పచ్చ చీరలో వచ్చి మెప్పించిన జాన్వీ… సోషల్ మీడియాలో కుర్రాళ్లను హీట్ ఎక్కించడంలో ఎప్పుడు వెనక్కి తగ్గలేదు.

Rashmika: ఐపీఎల్ స్టేజిపై ‘నాటు నాటు’ స్టెప్స్ తో అదరగొట్టిన నేషనల్ క్రష్

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ చిన్నది తాజాగా మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఒక్కరోజులో ఆమె ఎలా ఉంది అనేది.. నాలుగైదు ఫోటోల ద్వారా చూపించింది. పింక్ కలర్ టాప్ లో వెకేషన్ ఎంజాయ్ చేయడం, అద్దం ముందు మేకప్ వేసుకోవడం.. కారులో సెట్ కు వెళ్లడం లాంటివి చూపించింది. ముఖ్యంగా పింక్ కలర్ డిజైనర్ బ్రాలెట్ లో మాత్రం అమ్మడు హాట్ నెస్ ఓవర్ లోడ్ అన్నట్లుగానే ఉంది. ఎద అందాలను ఆరబోసి, నడుము చూపిస్తూ కుర్రాళ్ళ మతులను పోగొట్టేస్తోంది. ఎన్టీఆర్ 30 రిలీజ్ అవ్వకముందే ఈ చిన్నది ఈ ఫొటోలతో టెంప్ట్ చేసి తెలుగు కుర్రాళ్లను కూడా ముగ్గులోకి లాగేస్తుందే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత అమ్మడి జాతకం ఎలా ఉంటుందో చూడాలి.

Show comments