Site icon NTV Telugu

స్విమ్మింగ్ పూల్లో జూనియర్ అతిలోక సుందరి.. అరుపులు పెట్టిస్తోందిగా

janhvi kapoor

janhvi kapoor

అతిలోక సుందర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన అమ్మడు తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వలన షూటింగ్ లు వాయిదా పడడంతో జాను ఇంట్లో అందాలకు మెరుగుపెడుతున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. పూల పూల బికినీలో నీటిలో జలకాలాడుతూ కనిపించింది. ఇక అమ్మడి అందాలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అందాలను ఎరగా వేసి అరుపులు పుట్టిస్తున్నావ్ జాను.. అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. నువ్వు స్విమ్మింగ్ ఫూల్ లో కూల్ గా ఉండి .. మాకు మంటలు రేపుతున్నావ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్నో రోజులుగా జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెడుతుంది అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ జూనియర్ అతిలోక సుందరిని టాలీవుడ్ కి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version