Site icon NTV Telugu

ఆ విషయంలో శ్రీదేవి కూతురు టాప్ అంతే..

janvi kapoor

janvi kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందచందాల ఆరబోత గురించి అస్సలు విశ్లేషించాల్సిన పని అంతకన్నా లేదు. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి రాజసాన్ని ఒంట పట్టించుకోని జాన్వీ అంచలంచలుగా ఎదుగుతోంది. ఇక జాన్వీ నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న మాట వాస్తవమే .. కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా అలా మాత్రం ఉండదు.. రోమ్ లో రోమన్ లానే ఉండాలి అనే సామెతను జాన్వీ నిక్కచ్చిగా ఫాలో అవుతుంది. బీచ్ కి వెళ్తే బికినీ , పార్టీ కి వెళ్తే స్కర్ట్ .. గుడికి వెళ్తే లంగా వోణి.. ఇది అమ్మడు ఫాలో అయ్యే నియమం . ఎంతోమంది తారలు గుడి అని లేదు, బడి అని లేదు .. బయటికి ఎక్కడికివెళ్ళినా అందాలను ఆరబోసే డ్రెస్ లతో ప్రత్యేక్షమైపోతారు. కానీ జాన్వీ మాత్రం బయట ఎలా ఉన్నా .. మన తిరుపతి వచ్చిందంటే మాత్రం అచ్చ తెలుగు ఆడపడుచుల మారిపోతుంది.

https://ntvtelugu.com/samantha-and-naga-chaitanya-met-first-time-after-divorce/

తిరుపతి వచ్చిన ప్రతిసారి జాన్వీ కపూర్ అందంగా పద్దతైన తెలుగు అమ్మాయిగా లంగా ఓనీ లేదా చీర అది కాదంటే పద్దతైన చుడిదార్ ను మాత్రమే ధరిస్తుంది. శఎంతో నియమనిష్ఠలతో శ్రీవారిని దర్శించుకొని వెళ్తోంది. తాజాగా తిరుపతి వచ్చిన జాన్వీ పింక్ కలర్ వోణిలో పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. మిగతా విషయాలు పక్కనపెడితే ఈ విషయంలో శ్రీదేవి కూతురు టాప్ అంతే అని కొందరు అంటుంటే.. జాన్వీ పద్దతిగా ఉన్నా , పోష్ గా ఉన్నా అందగత్తె అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version