NTV Telugu Site icon

NTR30: టాలీవుడ్ కుర్రాళ్ల కళ్లన్నీ జాన్వీ పాప మీదనే..

Jahnvi

Jahnvi

NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతోంది.. అని అందాల అతిలోక సుందరి జాన్వీ కపూర్ పాట పాడుకొనే సమయం వచ్చేసింది. అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతుందా..? అని కొందరు.. ఏ హీరోతో మొదటిసారి రొమాన్స్ చేస్తుందో అని ఇంకొందరు.. ప్రభాస్, చరణ్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్.. ఇలా ప్రతి సినిమాకు ముందు ఆ హీరో సరసన జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ.. ఈ హీరో సరసన జాన్వీ ఎంట్రీ అంటూ పుకార్లు షికార్లు చేయడం.. వాటిని ఈ చిన్నది ఖండిస్తూ రావడం పరిపాటిగా మారిపోయింది. ఇక ఎట్టకేలకు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ నటిస్తోంది. అందరు అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ తోనేఈ ముద్దుగుమ్మ మొట్టమొదటిసారి రొమాన్స్ చేయనుంది. దీంతో అందరి ఆరాటం ఆమె కోసమే. ఇప్పటికే ఈ సినిమా కోసం జరిగిన ఫోటోషూట్ లో కూడా జాన్వీ పాల్గొందని టాక్.
Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ అధికారిక ప్రకటనకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను మార్చి 6 అనగా రేపు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వారి వీరు అనడమే కానీ, మేకర్స్ అధికారికంగా ప్రకటించింది లేదు. రేపు ఒక స్పెషల్ గ్లింప్స్ తో జాన్విని అధికారికంగా చిత్రంలోకి ఆహ్వానిస్తున్నారట. దీంతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని జాన్వీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్- జాన్వీ పెయిర్ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డ్యాన్స్ లో ఎన్టీఆర్ కింగ్.. అందాలు ఆరబోయడంలో జాన్వీ కింగ్.. ఇక డైరెక్షన్ లో కొరటాల కింగ్ మేకర్. ఆచార్య సినిమా ప్లాప్ అయ్యిందన్న ఒక్క రిమార్కే కానీ, అప్పటివరకు సక్సెసఫుల్ డైరెక్టర్స్ లో కొరటాల ఒకడు. అతడి సినిమాకు పేరు పెట్టినవారే లేరు. ఇక ఈ సినిమాతో అతను మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకోపక్క జాన్వీ మొదటి సినిమా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్.. అంతకుముందు చాలామంది బాలీవుడ్ భామలకు టాలీవుడ్ ఎంట్రీ అంతగా కలిసి రాలేదు. మరి ఈ భామ లక్ ఎలా ఉందో చూడాలి.

Show comments