NTV Telugu Site icon

NTR 30: శ్రీదేవి కూతురితో ఎన్టీవోడి మనవడు…

Janhvi Kapoor Ntr 30

Janhvi Kapoor Ntr 30

‘ఆకు చాటు పిందే తడిసే’, ‘జాబిలితో చెప్పనా’, ‘పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే’, ‘తెల్ల చీరా ఎర్ర బొట్టు కళ్ల కాటు’ లాంటి ఎవర్ గ్రీన్ పాటలని వినగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి ఎన్టీఆర్, శ్రీదేవిల జంట గుర్తొస్తుంది. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్, అతిలోక సుందరిగా శ్రీదేవి కలిసి 12 సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ని గుర్తు చేసేలా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కలిసి సినిమా చెయ్యబోతున్నారు.

Read Also: NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…

కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలని అందుకోవాలంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ కోసం ప్రయతించిన కొరటాల శివ అలియా భట్ ని అనుకున్నాడు కానీ డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక అలియా ‘ఎన్టీఆర్ 30’ నుంచి తప్పుకుంది. దీంతో అలియా ప్లేస్ జాన్వీ కపూర్ దక్కింది. ఈ మధ్యలో చాలామంది పేర్లు వినిపించాయి కానీ ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ జాన్వీ కపూర్ కి దక్కింది. ఈరోజు జాన్వీ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో శ్రీదేవిని గుర్తు చేసేలా విలేజ్ లుక్ లో నడుము అందాలు చూపిస్తూ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.

Read Also: NTR30: టాలీవుడ్ కుర్రాళ్ల కళ్లన్నీ జాన్వీ పాప మీదనే..

శ్రీదేవి కి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిన సౌత్ సినిమాల్లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వడం ఇదే మొదటిసారి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో శ్రీదేవికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి శ్రీదేవి కూతురిగా జాన్వీ తెలుగులో మొదటి సినిమా చెయ్యడం ప్రత్యేకమైన విషయం. అది కూడా తన ఫేవరేట్ హీరోతో జాన్వీ ఎంట్రీ ఇవ్వడం చాలా స్పెషల్. ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇష్టం అని, ఎన్టీఆర్ తో నటించడం డ్రీమ్ అని ఎన్నోసార్లు చెప్పిన జాన్వీ కపూర్… తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసి తన ఎగ్జైట్మెంట్ ని తెలిపింది. ఎన్టీఆర్ ఫాన్స్ మొత్తం ఇప్పుడు జన్వీ కపూర్ ని ఫాలో అవుతూ, జాన్వీ పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 సినిమా తర్వాత జాన్వీ కపూర్ సౌత్ లో కూడా బిజీ అవ్వడం గ్యారెంటీ. మరి శ్రీదేవి కూతురిని, ఎన్టీఆర్ మనవడిని ఒక దగ్గర చేర్చిన కొరటాల శివ, ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతాడు అనేది చూడాలి.

Show comments