ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆమెను అతి త్వరలో టాలీవుడ్ లో లాంచ్ చేయనున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ కథానాయకుడు అని ప్రచారం జరుగుతోంది. పూరి, విజయ్ ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వగానే పూరి, దేవరకొండ మళ్లీ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని సమాచారం. ఈ పాన్ ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పూరి కథనంతో ఇంప్రెస్ అయిన జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సంతకం చేసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక జాన్వీ కపూర్ త్వరలో విడుదల కానున్న ‘దోస్తానా 2’, ‘మిలీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలతో బిజీగా ఉంది.
