జననాయగన్ బ్రేక్ ఈవెన్ తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషిస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి 9న రిలీజ్ కానున్న జననాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Actress Raasi : యాంకర్ అనసూయ రాశి గారి ఫలాలు కామెంట్స్ పై సీనియర్ నటి రాశి ఫైర్
తెలుగులో నందమురి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమాను కాపీ పేస్ట్ చేయడంతో విమర్శలు వచ్చాయి. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం సినిమా అడ్వాన్స్ సేల్స్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదని చెప్పులు. జననాయగాన్ అడ్వాన్సు సేల్స్ ఇప్పటికే రూ. 20 కోట్లు దాటేశాయి. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున అద్వాన్స్ సేల్స్ జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. రోమియో పిచర్స్ రూ. 90 కోట్లకు ఈ సినిమా రైట్స్ కు కొనుగోలు చేసింది. అలాగే తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ కూడా భారీ ధర పలికాయి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 550 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న బజ్ చూస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందనే చెప్పొచ్చు. కానీ రీమేక్ రూమర్స్ ట్రేడ్ వర్గాలను కాస్త టెన్షన్ పెడుతుంది.
