Site icon NTV Telugu

TVK VIJAY : జననాయగన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay

Vijay

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని పూజా హెగ్డే కు సంబంధించి షూట్ ను ఫినిష్ చేసాడు డైరెక్టర్ వినోద్. ఇక మిగిలిన షూట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Also Read : SS. Rajamouli : SSMB29.. నేడే పృథ్వీరాజ్‌ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్

కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను ఈ శనివారం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ను స్వయంగా విజయ్ పాడడం విశేషం. పొలిటికల్ నేపథ్యంలో ర్యాప్ సాంగ్ లా అనబోతున్నట్టు సమాచారం. బాలయ్య నటించితిన సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా రాజాసాబ్ తో పాటు పోటీగా రిలీజ్ అవుతోంది.ఈ సినిమా తర్వాత విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ కు ట్రిబ్యూట్ గా ఉండేలా ప్లాన్ చేస్టున్నాడు H. వినోద్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version