దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. సాధారణంగా ఒక సినిమా వాయిదా పడితే కొన్ని వందలు లేదా వేలల్లో రీఫండ్‌లు జరుగుతుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో ఏకంగా 4.5 లక్షల టికెట్లను బుక్‌మైషో రీఫండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే భారత సినీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో టికెట్లను క్యాన్సిల్ చేసి, డబ్బులు వెనక్కి ఇవ్వడం ఇదే తొలిసారిగా నిలవనుంది.
Also Read:The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేట్ రావడంలో జాప్యం జరగడం, మద్రాస్ హైకోర్టులో విచారణ వంటి కారణాలతో విడుదల అనివార్యంగా వాయిదా పడింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు అమ్ముడయ్యాయి. సినిమా విడుదల ఆగిపోవడంతో, ప్రేక్షకుల నుంచి వచ్చిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని బుక్‌మైషో మరియు డిస్ట్రిబ్యూటర్లు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
సుమారు 4.5 లక్షల టికెట్లకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఏ పెద్ద సినిమాకు కూడా ఈ స్థాయిలో ఒకేసారి రీఫండ్ జరిగిన దాఖలాలు లేవు. లక్షలాది మందికి ఒకేసారి పేమెంట్స్ ప్రాసెస్ చేయడం బుక్‌మైషో లాంటి సంస్థలకు కూడా ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. టికెట్లు బుక్ చేసుకున్న వారికి వారి ఒరిజినల్ పేమెంట్ మోడ్ (UPI, కార్డ్స్ లేదా వాలెట్స్) ద్వారా 5 నుండి 7 పని దినాలలో డబ్బులు జమ అవుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
