బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌లను అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు జక్కన్న. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, మీడియా సమావేశాలు జరగలేదు. అయితే.. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ నవంబర్‌లో వస్తుందని రివీల్ చేశాడు రాజమౌళి. అయితే, నవంబర్‌లోనే ఎందుకు? అంటే, లేటెస్ట్‌గా ఒక సాలిడ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ టైటిల్‌ను అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’తో బిజీగా ఉన్నాడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన నవంబర్‌లో ఇండియాకి రాబోతున్నారు. అప్పుడే.. ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ఆయన ఆవిష్కరించనున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సమయంలో.. రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు కామెరాన్. ‘మీరు హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటే, మనం మాట్లాడుకుందాం’ అంటూ రాజమౌళిని ఆయన ఆహ్వానించారు. అంతేకాదు.. ఆయనతో వీడియో ఇంటరాక్షన్ కూడా అయ్యారు జక్కన్న. ఈ క్రమంలోనే జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే నిజమైతే.. జస్ట్ అనౌన్స్మెంట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ రీచ్ రావడం పక్కా. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే!
