NTV Telugu Site icon

Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?

Ramesh

Ramesh

Jailer: దిల యే బేచాఈన వే, రాస్తే పే నైన వే.. తాల సే తాల మిలా, హో తాల సే తాల మిలా.. ఏంటి ఈ సాంగ్ అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. జైలర్ సినిమాలో విలన్ వర్మ ప్లే లిస్ట్ అంటూ ఈ సాంగ్ కే వారు డ్యాన్స్ చేస్తారు కదా.. అదే ఈ సాంగ్. అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంటగా నటించిన తాల్ సినిమాలోని సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజ్ అయ్యినప్పుడు ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియదు కానీ, జైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మాత్రం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ చేస్తుంది అని చెప్పాలి. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వారం రోజుల్లో రూ. 350 కోట్ల కలక్షన్స్ రాబట్టి రజినీ ర్యాంపేజ్ ఏంటో మరోసారి ప్రేక్షకులకు చూపించింది. ఇక ఈ సినిమాలో రజినీ ఎలివేషన్స్ ఎంత హైలైట్ గా నిలిచాయో.. ఈ సాంగ్.. అందులో డ్యాన్స్ చేసినవారు అంతే హైలైట్ గా నిలిచారు. అయితే ఇందులో డ్యాన్స్ చేసిన ఒక వ్యక్తి మృతి చెందాడని మీకు తెలుసా..?.

Lokesh Kanagaraj: కొత్త కారు కొన్న ‘విక్రమ్’ డైరెక్టర్.. ధర ఎంతంటే ..?

వర్మ ప్లే లిస్ట్ అంటూ వచ్చిన సాంగ్ లో భరతనాట్యం, మైఖేల్ జాక్సన్ స్టెప్ వేస్తూ ఊగిపోతూ కనిపించాడు కదా.. అతనే టిక్ టాక్ రమేష్. అతనికి, అతని డ్యాన్స్ లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండేది. నడిరోడ్డుపై మైఖేల్ జాక్సన్ నడకతో అదరగొట్టేవాడు. ఇక అతని డ్యాన్స్ మెచ్చి.. అజిత్ తునీవు సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత రమేష్ కు జైలర్ లో అవకాశం దక్కింది. ఇక సినిమా రిలీజ్ కాకముందే అతను అనారోగ్య కారణాల వలన ఈ ఏడాది జనవరిలో కన్నుమూశాడు. ఇది నిజంగా విషాదకర వార్త అని చెప్పాలి. ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో.. సినిమా తరువాత అతడికి వచ్చే పేరు.. అవకాశాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవేమి చూడకుండానే రమేష్ కన్నుమూయడం.. ఎంతో బాధాకరమైన విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆయన లేకపోయినా.. ఈ సినిమా ద్వారా అతను ఎప్పుడు గుర్తు ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments