Site icon NTV Telugu

Jailer Collections: ఒకసారి పరువు తీశారు..మళ్ళీ మారక పోతే ఎలా?

Jailer

Jailer

Jailer Collections May Cross 500 crores gross: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. మొదటి ఆట నుంచి మంచి హిట్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి అంటే అక్కడ ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్టే జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంచి కలెక్షన్లలో దూసుకుపోతోన్న ఈ సినిమా ఇప్పటికే తమిళ నాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదల అయ్యి పెద్దెత్తున వసూళ్లు సాధిస్తోంది.

Nurse: ఏడుగురు నవజాత శిశువులను చంపిన నర్సు.. గుర్తించిన భారత సంతతి వైద్యుడు

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేసి లెక్కలు చెబితే మా సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 325 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే పరువు తీశారురా బాబు ఈ మాత్రం చూసుకోరా అని రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటుతుందన ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వెబ్‌సైట్స్ ప్రకారం జైలర్ తొమ్మిదో రోజు రూ. 9 కోట్లు వసూళ్లు రాబట్టిందని, ఇప్పటి వరకు తమిళంలో రూ. 184.65 కోట్లు, తెలుగులో రూ. 47.05 కోట్లు, కన్నడలో రూ. 2.05 కోట్లు, హిందీలో రూ. 2.1 కోట్లు వసూలు అయ్యాయని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా మొత్తం కలెక్షన్స్ రూ. 487.39 కోట్లు దాటగా నేడు 500 కోట్లు దాటే అవకాశం ఉంది” అని ట్వీట్ అంటున్నారు. ఇప్పుడైనా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ మారక పోతే పరువు తీసుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version