Jailer: విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్ ని రెండు రోజుల్లోనే లేపేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకనాయకుడు కమల్ హాసన్ మాస్ అవతారంలోకి మారి చేసిన సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ విక్రమ్ గా కమల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రేంజులో కమల్ హాసన్ ని ఇప్పటివరకూ చూడకపోవడంతో మూవీ లవర్స్ అంతా విక్రమ్ సినిమాని రిపీట్ మోడ్ లో చూసారు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ తో విక్రమ్ సినిమాకి ప్రాణం పోసాడు. కమల్ లాంటి నటుడికి ఫాహద్, సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ కూడా తోడవ్వడంతో విక్రమ్ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా విక్రమ్ సినిమా నెవర్ బిఫోర్ యూపోరియాని క్రియేట్ చేసింది. త్రి మిలియన్ డాలర్స్ ని రాబట్టి కోలీవుడ్ ఓవర్సీస్ టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఓవర్సీస్ లో విక్రమ్ సినిమా రాబట్టిన కలెక్షన్స్ చూసి కోలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి, అయితే విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్ ని రెండు రోజుల్లోనే బ్రేక్ చేస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు అయిదేళ్ల జైలర్ సినిమాతో హిట్ అందుకున్న రజినీకాంత్ ని చూడడానికి మూవీ లవర్స్ అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. దీంతో ఆల్ సెంటర్స్ హౌజ్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. విక్రమ్ సినిమా ఓవర్సీస్ లో రాబట్టిన త్రీ మిలియన్ డాలర్స్ ని జైలర్ మూవీ రెండుల్లోనే రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇస్తోంది. వీకెండ్ స్టార్ట్ కాకముందే రజినీ ర్యాంపేజ్ ఈ రేంజులో ఉంటే సండే ఎండ్ అయ్యే టైంకి జైలర్ సృష్టించబోయే వసూళ్ల సునామీలో ఎన్ని రికార్డులు ఎగిరిపోతాయో చూడాలి.
Also Read
- Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
- Ram Charan: 'నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది'.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
- Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
- Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
తాజావార్తలు
-
Petrol Prices: పెట్రోల్ ధరలు తగ్గుతాయా? ఆయిల్ మిగులు దిశగా ప్రపంచ మార్కెట్?
-
Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
-
Pakistan: ‘సింధు నాగరికత మాదే..బుద్ధుడు మా వాడే’.. పాకిస్థాన్ కొత్త నాటకం..
-
Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్‌లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
-
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!